Jump to content

దండమూడి రాజగోపాలరావు

వికీపీడియా నుండి
దండమూడి రాజగోపాలరావు
దండమూడి రాజగోపాలరావు
జననందండమూడి రాజగోపాలరావు
అక్టోబరు 16, 1916
గండిగుంట, కృష్ణా జిల్లా
మరణంఆగష్టు 6, 1981
ప్రసిద్ధిప్రముఖ క్రీడాకారుడు
నర్తనశాల చిత్రంలో భీముడు పాత్రధారి.
పిల్లలుఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి

దండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 - ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, "ఇండియన్ టార్జన్" అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1] ఈయన 1963లో విడుదలైన నర్తనశాల[2] సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు సినిమాలోనూ, భీముని పాత్ర పోషించాడు.

రాజగోపాలరావు, కృష్ణా జిల్లా, గండిగుంట గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. కోడి రామ్మూర్తి నాయుని స్ఫూర్తితో బరువులు ఎత్తటం ఒక వ్యాసంగంగా స్వీకరించాడు. కొంతకాలం బరువులెత్తడంలో శిష్ట్లా సోమయాజులు వద్ద శిక్షణ పొందాడు. ఆ తరువాత కొల్లి రంగదాసుతో పాటు సంచరిస్తూ అనేక రాష్ట్రాలు, దేశాలలో ప్రదర్శనలిచ్చాడు.

రాజగోపాలరావుకు అనసూయతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు - ఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి. రాజగోపాలరావు 1981, ఆగష్టు 6న మరణించాడు. ఈయన పేరు మీదుగా, విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి "దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం" అని నామకరణం చేశారు.[3] దీనిని అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రారంభించాడు.

మూలాలు

[మార్చు]
  1. http://www.doha-2006.com/gis/menuroot/sports/Weightlifting_HR.aspx-id=WL.html[permanent dead link]
  2. http://www.imdb.com/title/tt0263778/
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-06. Retrieved 2007-09-13.